Narappa : నాగ్ బాటలోనే వెంకీ .. డేరింగ్ స్టెప్ కి రెడీ..

Narappa : నాగ్ బాటలోనే వెంకీ .. డేరింగ్ స్టెప్ కి రెడీ..
x

 Venkatesh narappa movie

Highlights

Narappa : కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి..

Narappa : కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.. తాజాగా కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో మళ్ళీ కొన్ని సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను అయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ తన అప్ కంమింగ్ మూవీ నారప్ప షూటింగ్ ని అక్టోబర్ లో మొదలు పెట్టాలని చూస్తున్నాడట.. అయితే సినిమా షూట్ మొత్తాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలనీ చిత్రబృందం ప్లాన్ లో ఉందట.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తి అయింది.

తమిళ్ లో ధనుష్ , మంజు వారియర్ కలిసి నటించిన అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నాడు వెంకీ.. ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవడం, వెంకటేష్ దీనిని రీమేక్ చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రతీకార కథాంశంతో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్‌ నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాతలు అయిన సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిమిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి లుక్స్ విడుదలై సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories