మోసగాళ్ళకు వెంకీ సపోర్ట్!

మోసగాళ్ళకు  వెంకీ సపోర్ట్!
x
Highlights

Vishnu Mosagallu Movie : టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మంచు విష్ణు మోసగాళ్ళు సినిమా కూడా ఒకటి.. ఇప్పటికే పోస్టర్, టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమాకి ఇప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్ ఆడ్ కాబోతుంది.

Vishnu Mosagallu Movie : టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మంచు విష్ణు మోసగాళ్ళు సినిమా కూడా ఒకటి.. ఇప్పటికే పోస్టర్, టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమాకి ఇప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్ ఆడ్ కాబోతుంది.. ఈ సినిమా టీజర్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాకి సీనియర్ హీరో వెంకటేష్ తన వాయిస్ ఓవర్‌ను అందిస్తున్నారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెంకీ తన వాయిస్ ని అందిస్తున్నారు. దీనితో ఈ సినిమాకి మరింత బజ్ ఏర్పడింది.

చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విష్ణుకు జోడీగా బాలీవుడ్ భామ రుహీ సింగ్ నటిస్తోంది. ఎప్పుడు లేనంతగా ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టి మరి నిర్మిస్తున్నాడు విష్ణు.. ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు, కాజల్ తో పాటుగా నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంతోనే టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న మోసగాళ్లు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories