మోసగాళ్ళకి బన్నీ సపోర్ట్!

Mosagallu Official Teaser : మంచు మోహన్ బాబు కుమారుడిగా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు.. మొదట్లో పర్వాలేదు అనిపించిన విష్ణు... ఆ తరవాత వరుస సినిమాలు విష్ణుకి ఎదురయ్యాయి...

Krishna
Published on: 3 Oct 2020 11:00 AM IST
మోసగాళ్ళకి బన్నీ సపోర్ట్!
X

 Mosagallu Official Teaser

Mosagallu Official Teaser : మంచు మోహన్ బాబు కుమారుడిగా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు.. మొదట్లో పర్వాలేదు అనిపించిన విష్ణు... ఆ తరవాత వరుస సినిమాలు విష్ణుకి ఎదురయ్యాయి... ఇప్పుడు 'మోసగాళ్లు' అనే ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విష్ణు.. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, మూవీ పోస్టర్స్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేయగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదిగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన అల్లు అర్జున్.. విష్ణు తనకి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అని చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు బన్నీ..

ఇక టీజర్ విషయానికి వచ్చేసరికి 31 సెకనుల నిడివితో ఉన్న మూవీ టీజర్ అధ్యతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పీచ్ తో మొదలుపెట్టి టీజర్ లో గోడౌన్‌లో బస్తాలకొద్ది కరెన్సీ నోట్లు చూపిస్తూ భారీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్.. ఇక టీజర్ లో ఇది సరిపోతుందిగా అని కాజల్ అడిగితే.. ఆట ఇప్పుడే మొదలైంది అంటూ విష్ణు సమాధానం ఇవ్వడం టీజర్ పైన మరింత ఆసక్తిని పెంచింది. ఇక సినిమా ఎక్కువ భాగాన్ని అమెరికాలోనే తెరకెక్కించారు. ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు, కాజల్ తో పాటుగా నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story