Vaishnav Tej: ప్రముఖ నిర్మాత తో గొడవకు దిగిన వైష్ణవ్ తేజ్..అసలు ఏమి జరిగింది?

Vaishnav Tej: నిర్మాత వైఖరితో విసిగిపోయిన వైష్ణవ తేజ్

admin1
Updated on: 17 Jan 2022 2:17 PM IST
Hero Vaishnav Tej Clashes With Film Producer | Tollywood News Online
X

 ప్రముఖ నిర్మాత నిర్మాత తో గొడవకు దిగిన వైష్ణవ్ తేజ్

Vaishnav Tej: సాయి ధరమ్ తేజ్ తమ్ముడు గా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన "కొండపొలం" సినిమాతో అంతగా మెప్పించలేకపోయినా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో తన మూడవ సినిమాతో బిజీగా ఉన్నారు. బాపినీడు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ కాంబినేషన్లో వైష్ణవ్ తేజ్ మరొక సినిమా చేయాల్సి ఉంది. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, దర్శకుడు త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ తో కలిపి వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో వైష్ణవ్ తేజ్ మరియు బాపినీడు మధ్య గొడవ మొదలైంది.

వైష్ణవ్ తేజ్ తన నాలుగో సినిమాని కూడా తన బ్యానర్ లోనే చెయ్యాలని నిర్మాత పట్టు పడుతున్నారట. కానీ వైష్ణవ్ తేజ్ దీనికి ససేమిరా ఒప్పుకోవడంలేదు. మరొక సినిమా చేస్తానని కమిట్ మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది నాలుగవ సినిమానా లేక ఐదవ సినిమా అని అగ్రిమెంట్ మీద ఎక్కడ సంతకం చేయలేదని వైష్ణవ్ తేజ్ చెబుతున్నట్లు సమాచారం. ఇక ఈ గొడవల కారణంగా వైష్ణవ్ తేజ్ రెండో సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల టైటిల్ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. మరి ఈ విషయాన్ని బాపినీడు మరియు వైష్ణవ్ తేజ్ ఏ విధంగా సెటిల్ చేసుకుంటారు ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story