Hero Surya Donate : 5 కోట్ల విరాళం ప్రకటించిన హీరో సూర్య!

Hero Surya Donate : కరోనాని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డుమీద పడ్డారు.. అందులో

Krishna
Published on: 22 Aug 2020 5:54 PM IST
Hero Surya Donate : 5 కోట్ల విరాళం ప్రకటించిన హీరో సూర్య!
X

Hero Surya

Hero Surya Donate : కరోనాని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డుమీద పడ్డారు.. అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. సినిమా షూటింగ్ లు లేకపోవంతో చాలా మంది సినిమా ఆర్టిస్టులు ఆర్థిక సమస్యల ఎదురుకుంటున్నారు.. అయితే వారిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అయితే తాజాగా వారికీ హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు.

సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికీ రూ. 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టుగా వెల్లడించారు సూర్య.. డిజిటిల్ మీడియాకు తన లేటెస్ట్ సినిమా 'ఆకాశమే హద్దురా' విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తంలో రూ. 5 కోట్లను కరోనా కారణంగా ఆర్ధికంగా బాధపడుతున్న కుటుంబాలకు అందేలా ఏర్పాట్లు చేస్తానని సూర్య వెల్లడించారు.. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమనే నమ్ముకొని చాలా కుటుంబాలు పనిచేస్తున్నాయి.. కరోనా సమయంలో వారు ఉపాధి కోల్పోయి చాలా కష్టాలు పడుతున్నారు.. అందుకే వారికీ అండగా నిలవాలని అనిపించిందని సూర్య అన్నారు.

ఇక తాజాగా సూర్య నటిస్తున్న 'ఆకాశమే హద్దురా' చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా సూర్య వెల్లడించారు.. ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారని, డైరెక్టర్ సుధకి చాలా థాంక్స్ అని అన్నారు... కష్టకాలం తనకు అండగా నిలించిన అందరికీ సూర్య కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సినిమాని థియేటర్స్‌ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నాం కానీ పరిస్థితులు కారణంగా ఓటీటీలో విడుదల చేస్తున్నామని దీనిని అభిమానులు అర్థం చేసుకోవాలని అన్నారు సూర్య.

Krishna

Krishna

Next Story