మళ్ళీ పెళ్ళి నీ కర్మ అంటున్న వర్మ.. రెండో పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్

Sandeep Reddy
Updated on: 30 July 2021 10:46 AM IST
Hero Sumanth Clarifies About Second Marriage Gossips in Twitter And He Says Those Are False News
X

 సుమంత్ - రామ్ గోపాల్ వర్మ 

Sumanth Second Marriage Pavithra: అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న తరుణంలో ఎట్టకేలకు ఆ హీరో పెళ్లి విషయంపై స్పందించాడు. "సుమంత్ వెడ్స్ పవిత్ర" అనే పెళ్లి కార్డుతో రకరకాల ఊహాగానాలు రావడంతో గురువారం సుమంత్ ట్విట్టర్ వేదికగా తను ఎలాంటి పెళ్లి చేసుకోవడం లేదని కేవలం ఆ పెళ్లి కార్డు తాను నటించబోతున్న తరువాతి చిత్రానికి సంబంధించినది మాత్రమేనని అటు అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లకు క్లారిటీ ఇచ్చాడు. అయితే గురువారం మధ్యాహ్నం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ తో సుమంత్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.

"ఒకసారి అయ్యాక నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్..నీ కర్మ నీ పవిత్ర కర్మ అనుభవించండి" అంటూ ఒక ట్వీట్ చేయడంతో పాటు.., మరొక ట్వీట్ లో "ఒక పెళ్లి చేసుకోవడమే నూరేళ్ళ పెంట అయితే రెండో పెళ్లి ఎందుకు సామీ నా మాటవిని మానెయ్యి" అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లకు ఒకింత అసహనానికి గురైన సుమంత్ ఇక లాభం లేదని తన పెళ్లి పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అంటూనే ఆ పెళ్లి కార్డు తన తదుపరి సినిమాదని ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తానని ట్వీట్ చేశాడు.




Sandeep Reddy

Sandeep Reddy

Next Story