Sudheer Babu : మహేష్ కి విలన్ గా చేయడానికి రెడీ : సుధీర్ బాబు

Sudheer Babu : మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే సుధీర్ బాబు..శివ మనసులో శ్రుతి నుంచి మొన్న వచ్చిన నన్ను దోచుకుందువటే

Krishna
Published on: 30 Aug 2020 7:57 PM IST
Sudheer Babu : మహేష్ కి విలన్ గా చేయడానికి రెడీ : సుధీర్ బాబు
X

 Sudheer Babu

Sudheer Babu : మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే సుధీర్ బాబు..శివ మనసులో శ్రుతి నుంచి మొన్న వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాల వరకు చాలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా వి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 05 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియా వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు సుధీర్ బాబు..

ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో కలిసి ఎప్పుడు నటిస్తారు అన్న ప్రశ్న సుధీర్ బాబుకి ఎదురైంది. అయితే దీనిపైన సుధీర్ బాబు స్పందిస్తూ.. మహేష్ సినిమాలో కనిపించడం పెద్ద సమస్య కాదని, అయితే ఆది కనిపించేదేదో మంచి పాత్రకి కనిపిస్తే అభిమానులకి గుర్తుండిపోతుందని అన్నారు. మహేష్ బాబు సినిమాలో అలా కనిపించి ఇలా వెళ్ళాలి అంటే అది ఎప్పుడో జరిగిపోయి ఉండేదని అన్నాడు. మహేష్ మూవీలో విలన్ గా చేయడానికి కూడా ప్రాబ్లమ్ లేదని, మంచి పాత్ర అయితే చాలు చేస్తానని అన్నాడు.

ఇక ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'v' సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు, నాని హీరోలుగా నటించగా, అదితిరావు హైదరి, నివేతా థామస్ హీరోయిన్లు గా నటించారు.. అమిత్ త్రివేది సంగీతం అందించగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందించారు. విడుదలైన టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Krishna

Krishna

Next Story