'V' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది!

V నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది!
x
V movie
Highlights

యంగ్ హీరోస్ నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'... ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు...

యంగ్ హీరోస్ నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం 'వి'... ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. నిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ నుంచి 'చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక..' అంటూ సాగే సాంగ్ వీడియో ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఫుల్ సాంగ్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

ఇక ఈ చిత్రంలో నాని ఓ సైకో పాత్ర పోషిస్తుండగా, సుధీర్‌ బాబు పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నాడు. అదితిరావు హైదరి, నివేతా థామస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories