Sudheer Babu : వారినుంచి సలహాలు మాత్రమే తీసుకుంటా : సుధీర్ బాబు

Sudheer Babu : ఈ తరం కథానాయకులలో కథకి, పాత్రకి ప్రాధాన్యం ఇచ్చే హీరోలలో సుధీర్ బాబు ఒకరు.. చేసినవి తక్కువ సినిమాలే అయిన మంచి

Krishna
Published on: 9 Sept 2020 11:03 AM IST
Sudheer Babu : వారినుంచి సలహాలు మాత్రమే తీసుకుంటా : సుధీర్ బాబు
X

krihsna, mahesh babu, sudheer babu

Sudheer Babu : ఈ తరం కథానాయకులలో కథకి, పాత్రకి ప్రాధాన్యం ఇచ్చే హీరోలలో సుధీర్ బాబు ఒకరు.. చేసినవి తక్కువ సినిమాలే అయిన మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.. శివ మనసులో శ్రుతి(SMS) నుంచి మొన్న వచ్చిన 'వి' సినిమా వరకు అన్ని కొత్త తరహ కథలనే ఎంచుకున్నాడు.. ఇందులో కొన్ని సక్సెస్ ని ఇవ్వగా మరొకొన్ని చిత్రాలు ప్లాప్ ని ఇచ్చాయి.. అయినప్పటికీ తనని తానూ నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుధీర్ బాబు.. తాజా 'వి' మూవీ సక్సెస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంగ్లిష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు సుధీర్ బాబు.

" నా సినిమా కెరీర్ లో ఇప్పటివరకు నా మామయ్య ( కృష్ణ ), మహేష్ బాబు దగ్గరికి వెళ్లి నా సినిమాని నిర్మించండి అని అడగలేదు.. గైడ్స్ కూడా ఎప్పుడు కోరలేదు. నేను సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు వారి నుంచి ఎలాంటి సలహా కూడా కోరలేదు.. నా సొంతంగా ఏదైనా చేయాలి అనిపించడం వల్లే వారి కలవలేదు. నేను సినిమాల్లోకి రాకముందు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. అలా సినిమా పైన కొంచం అవగాహన పెరిగింది.. కొంత మంది స్నేహితులు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మా ఫ్యామిలీది' పురుగుల మందుల బిజినెస్ కావడంతో దానిని నుంచి బయటకు రావడానికే సినిమాల్లోకి వచ్చాను " అని సుధీర్ బాబు వెల్లడించాడు.

ఇక 'వి' సినిమా విషయానికి వచ్చేసరికి ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 05 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సుధీర్ బాబు, నాని హీరోలుగా నటించగా, అదితిరావు హైదరి, నివేతా థామస్ హీరోయిన్లు గా నటించారు.. అమిత్ త్రివేది సంగీతం అందించగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Krishna

Krishna

Next Story