Tollywood: "మహా సముద్రం" చిత్రానికి భారీగా సిద్ధార్థ్ రెమ్యునరేషన్

Tollywood: బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటనా వంటి చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించిన హీరో సిద్ధార్థ్

Sandeep Reddy
Published on: 11 July 2021 4:43 PM IST
Hero Siddharth Charges High Remuneration For Maha Samudram Movie
X

మహా సముద్రం సినిమాలో సిద్దార్థ్ (ఫైల్ ఫోటో)

Tollywood: బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటనా వంటి చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించిన హీరో సిద్ధార్థ్ గత కొంత కాలంగా తెలుగులో సరైన ఆఫర్లు లేక సతమతమయ్యాడు. అటు తమిళంలో నటించి తెలుగులో డబ్ చేసి విడుదలైన చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే చాలా కాలం గ్యాప్ తరువాత సిద్దార్థ్ మరోమారు తెలుగులో తన అదృష్టం పరీక్షించుకొనున్నాడు. అయితే తెలుగులో తన రీఎంట్రీకి సిద్దార్థ్ బాగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన "మహా సముద్రం" సినిమాలో హీరో శర్వానంద్ తో పాటు సిద్దార్థ్ ప్రధాన పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం నెల రోజుల కాల్షిట్ ఇచ్చిన సిద్దార్థ్ తన 30 రోజుల షూటింగ్ షెడ్యూల్ కి 2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. అను ఇమాన్యుల్, అదితి రావు హీరోయిన్స్ గా నటించిన చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఇప్పటివరకు పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సిద్దార్థ్ కి "మహా సముద్రం" చిత్రంతో మహా విజయం రానుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story