Nikhil tweet on Nithin's marriage: నితిన్ భయ్యా బాకీ ఉన్నావ్.. వదిలేదే లేదు.. నిఖిల్ ఆసక్తికరమైన ట్వీట్!

Nikhil tweet on Nithin's marriage: మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని

Krishna
Published on: 27 July 2020 7:32 PM IST
Nikhil tweet on Nithins marriage: నితిన్ భయ్యా బాకీ ఉన్నావ్.. వదిలేదే లేదు.. నిఖిల్ ఆసక్తికరమైన ట్వీట్!
X
Hero Nikhil siddharth interesting tweet on nithin marriage

Nikhil tweet on Nithin's marriage: మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. కరోనా నేపధ్యంలో జరిగిన పెళ్లి కావడంతో పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. కథానాయకులు వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ తదితరులు హాజరై కొత్త జంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినిమా పరిశ్రమ నుంచి యంగ్ హీరోలు వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్ తేజ్ లు హాజరయ్యారు. ఇక నితిన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే నితిన్ పెళ్లి పైన యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. " నితిన్ భయ్యా.. కొత్త జర్నీ ప్రారంభించిన నీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కాకపోతే నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్! నిన్ను వదిలేదే లేదు.. కరోనా తర్వాత పార్టీ చేసుకుందాం" అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. నితిన్ నటించిన సంబరం సినిమాలో నిఖిల్ ఓ చిన్న సన్నివేశంలో కనిపిస్తాడు. ఇక తన ప్రేయసి షాలిని మేడలో తాళి కడుతున్న ఫోటోను నితిన్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. మొత్తానికి ఇంటివాడినయ్యాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ కి ఇది 29 వ చిత్రం కావడం విశేషం..ఇక ఈ సినిమాతో పాటుగా గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.



Krishna

Krishna

Next Story