Nani 'V' Movie : నాని 'V' ఓటీటీ ముహూర్తం ముందుకు జరిగిందా?

Nani V Movie :  నాని V ఓటీటీ ముహూర్తం ముందుకు జరిగిందా?
x

Nani v movie

Highlights

Nani 'V' Movie : విభిన్న కథా చిత్రాల చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'v'..

Nani 'V' Movie : విభిన్న కథా చిత్రాల చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'v'.. ఇందులో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటించగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా, అమిత్ త్రివేది సంగీతం అందించాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం..

అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ చాలా ప్రయ‌త్నాలు చేసింది. కానీ అప్పుడే క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చడంతో.. థియేట‌ర్స్ అన్ని లాక్ డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో ఈ సినిమా విడుదల వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ రేటు పలకడంతో సెప్టెంబర్ 05 న ఓటీటీలో విడుదల అవుతుంది.

సినిమా విడుదల దగ్గరపడడం చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్ ని మొదలు పెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం..నాని మాత్రం ఇంకా కాస్త ముందుగానే పలకరించనున్నారని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ 4 వ తేది రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో.. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories