Nani 'V' Movie: ఆసక్తి రేకెత్తిస్తున్న 'వి' ట్రైలర్

Nani V Movie: ఆసక్తి రేకెత్తిస్తున్న వి ట్రైలర్
x
Highlights

Nani 'V' Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు.. కానీ విభిన్న కథా చిత్రాల దర్శకులు కొందరే ఉన్నారు..

Nani 'V' Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు.. కానీ విభిన్న కథా చిత్రాల దర్శకులు కొందరే ఉన్నారు.. అందులో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు.. చేసినవి తక్కువే సినిమాలే అయిన ఆయన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన అష్టాచమ్మా, అంతకుముందు ఆ తరవాత, గోల్కొండ హై స్కూల్, సమ్మోహనం చిత్రాలు చాలా క్లాస్ సినిమాలు.. అయితే ఇప్పుడు ఆయన రూట్ మార్చి 'v' అనే సినిమాని చేశారు..

ఈ సినిమాలో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటించగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం.. ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ చాలా ప్రయ‌త్నాలు చేసింది. కానీ అప్పుడే క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చడంతో.. థియేట‌ర్స్ అన్ని లాక్ డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే, ఈ చిత్రం సెప్టెంబర్ 05 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ టీజర్ సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ట్రైలర్ ఒకసారి గమనిస్తే.. ఇందులో యాక్షన్ పార్ట్స్ ని చాలా రిచ్ గా తెరకెక్కించారు... అసలు ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాలో యాక్షన్ పార్ట్ కి పెద్దగా స్కోప్ ఉండదు. కానీ ఇందులో భారీ హంగులతో తెరకెక్కించారు. ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ వలన ఫ్యూచర్ లో స్టార్ హీరోలతో కూడా ఇంద్రగంటి సినిమాలు చేసేందుకు ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..



Show Full Article
Print Article
Next Story
More Stories