Jersey Movie Remake: తన కంటే షాహిద్ కపూర్ ఇంకా బాగా నటించగలరు అంటున్న నాని

* షాహిద్ కపూర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నాచురల్ స్టార్

admin1
Updated on: 15 Sept 2021 2:32 PM IST
Hero Nani Says Shahid Kapoor Will Act Better Than me in Jersey Hindi Remake Movie
X

 షాహిద్ కపూర్ - నాని 

Jersey Movie Remake: షాహిద్ కపూర్ ఈమధ్య తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాల మీద కన్ను వేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన "అర్జున్ రెడ్డి" సినిమా ని "కబీర్ సింగ్" గా హిందీ లో రీమేక్ చేసిన షాహిద్ కపూర్ ఇప్పుడు నాని హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "జెర్సీ" సినిమాని కూడా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పంకజ్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తెలుగు "జెర్సీ" కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్ కి కూడా దర్శకుడిగా వ్యహరిస్తున్నాడు. గీత ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ మరియు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

"జెర్సీ" అనే టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన నాని తనకంటే షాహిద్ కపూర్ ఈ సినిమాలో ఇంకా బాగా నటించగలరు అని చెప్పడం విశేషం. షాహిద్ కపూర్ చాలా మంచి నటుడని, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలరని అందుకే ఈ సినిమాలో కూడా తన కంటే షాహిద్ కపూర్ ఇంకా బాగా నటించగలరు అని చెప్పుకొచ్చాడు నాని. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సాచేత్ పరంపర సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story