Actor Karthi: కూచిపూడి కళాకారులకు అండగా హీరో కార్తీ

Actor Karthi: ఆంధ్రప్రదేశ్ కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు హీరో కార్తీ రూ. లక్ష సాయం అందించారు.

Kranthi
Published on: 12 Jun 2021 12:53 PM IST
Hero Karthi Helps to AP Kuchipudi Artists
X
హీరో కార్తీక్ (ఫైల్ ఇమేజ్)

Actor Karthi: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి భారతదేశాన్ని అతాలకుతలం చేసింది. ఈ మహమ్మారి ప్రభావం ఆరంగం.. ఈ రంగం అని కాదు అన్ని రంగాలపై పడింది. అటు సినీ పరిశ్రమపై కూడా ఎక్కువగానే ప్రభావం చూపింది. ఈ మహమ్మారి కారణంగా గతేడాది నుంచి సినీ షూటింగ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవల కొద్ది నెలలు సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభమవగా.. అటు థియేటర్లు కూడా 50 % ఆక్యుపెన్సీతో ఓపెన్ చేశారు. దీంతో బడా హీరోలు సైతం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. కానీ కరోనా రెండో దశ మరోసారి సినీ ఇండస్ట్రీని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా.. సినిమా షూటింగ్స్ నిలిచిపోగా.. థియేటర్లు మళ్లీ మూత పడడంతో.. సినీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది.

ఈ క్రమంలోనే వారిని ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. తాజాగా హీరో కార్తీ కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు ఆయన రూ. లక్ష సాయం అందించారు. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలు విజ్ఞప్తి మేరకు కార్తీ ముందుకు వచ్చారు. గతేడాది కూడా ఈ సాయాన్ని అందించాలనుకున్న కార్తి.. కొన్ని కారణాలతో సహాయం అందించలేకపోయాడు. ఆ లక్ష్యాన్ని ఈ ఏడాది పూర్తి చేసుకున్నాడు. 50 మంది కళాకారులకు ఆ డబ్బును వారి అకౌంట్లలోకి జమ చేసినట్లుగా భావన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు.

Kranthi

Kranthi

Next Story