Karthi: రెండు విభిన్న పాత్రలతో అలరించనున్న కార్తి

Karthi: ద్విపాత్రాభినయం చేయబోతున్న కార్తి

admin1
Updated on: 8 Jan 2022 10:00 PM IST
Hero Karthi Double Role in Sardar Movie | Telugu Movie News
X

రెండు విభిన్న పాత్రలతో అలరించనున్న కార్తి 

Karthi: కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్దార్". స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి "అభిమన్యుడు" ఫేమ్ డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రజిష్ విజయన్, మునీష్ కాంత్, చంకీ పాండే, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అందుకోసం కార్తి రెండు విభిన్నమైన లుక్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నారు. మొదట ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న కార్తీ ఒక వయసైపోయిన ఖైదీ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రల కోసం కార్తి కొత్త మేక్ఓవర్ ట్రై చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story