Jathi Ratnalu: హిందీలో 'జాతి రత్నాలు'..హీరో కన్ఫాం.. ఎవరంటే

Jathi Ratnalu: ఈ మూవీని హిందీలో రీమేక్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్‌ చేసినట్లు సమాచారం

Samba Siva Rao
Published on: 26 April 2021 5:48 PM IST
Hero Confirm To Jathi Ratnalu Movie in Hindi
X

జాతి రత్నాలు హిందీ 

Jathi Ratnalu: లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఏడాది విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచి చిత్రాల్లో 'జాతి రత్నాలు'ఒకటి. ఫుల్‌లెన్త్‌ కామెడీతో మార్చిలో విడుదలైన 'జాతి రత్నాలు' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. 'జాతి రత్నాలు'మూవీ హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని హిందీలో రీమేక్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్‌ చేసినట్లు సమాచారం.

అయితే దర్శకుడు అనుదీప్‌ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు ఇప్పుడు బలం చేకూరుతున్నాయి. హిందీలో రీమేక్‌ లో హీరోను కూడా నవీన్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది‌.'జాతి రత్నాలు' హిందీ రీమేక్‌ను కూడా నవీన్ పోలీశెట్టినే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్‌ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే 'జాతి రత్నాలు' హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. కాగా గతంలో నవీన్ పోలీశెట్టి, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 'చిచోరే' మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే.

నవీన్ పొలీశెట్టిని హీరోగా తీసుకున్నప్పటికీ మరో రెండు ముఖ్య పాత్రలు విషయం ఎంపిక చేయడంతో దర్శకుడికి పెద్ద తలనొప్పిగా మారిందంట. తెలుగు నవీన్ స్నేహితులుగా చేసిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు చాలా ముఖ‌్య. అయితే వీరి ప్లేస్‌లో ఎవరిని ఎంపిక చేయాలనేది దానిపై దర్శకుడికి పెద్ద కష్టంగా మారిందంట. లిస్ట్ లో నలుగురు పెర్లు ఉన్నప్పటికీ రీప్లేస్ చేయకలుగుతారా? లేదా అనే ఆలోచనలో అనుదీప్ ఉన్నట్లు టాక్.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story