బాలయ్య కోసం మహేష్ ఫ్రెండ్?

Allari Naresh With Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి

Krishna
Published on: 14 Sept 2020 12:57 PM IST
బాలయ్య కోసం మహేష్ ఫ్రెండ్?
X

Balakrishna, Mahesh babu 

Allari Naresh With Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చాలా మంది హీరోలని అనుకున్న బోయపాటి ఆ పాత్రను అల్లరి నరేష్‌తో చేయించాలని అనుకుంటున్నాడట.. ఇప్పటికే అల్లరి నరేష్ ని కలిసి పాత్ర నరేషన్ ని ఇచ్చాడట బోయపాటి.. అల్లరి నరేష్ ఆ పాత్రను చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్టుగా సమాచారం.. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.. ఇక ఇందులో ఓ కొత్త హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టుగా బోయపాటి వెల్లడించాడు. ఇక గతంలో అల్లరి నరేష్ మహేష్ బాబు మహర్షి సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే..

ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య సరసన ఒక హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసింది చిత్రబృందం.. దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న బాలయ్య, బోయపాటి సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారని సమాచారం..

Krishna

Krishna

Next Story