Nandamuri Balakrishna : బాలయ్య, బోయపాటి మూవీకి పవర్ఫుల్ టైటిల్

Nandamuri Balakrishna : బాలయ్య, బోయపాటి మూవీకి పవర్ఫుల్ టైటిల్
x

Boyapati srinu, Nandamuri Balakrishna

Highlights

Nandamuri Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

Nandamuri Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా ఆసక్తి నెలకొంది. గతంలో సూపర్ మ్యాన్, మోనార్క్, డేంజర్ అనే టైటిల్ లని ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపైన చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. అయితే ఇప్పడు ఈ లిస్టులోకి మరో టైటిల్ చేరినట్టుగా తెలుస్తోంది. అదే 'టార్చ్ బేరర్'.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవిందసమేత సినిమాలోని డైలాగ్ లోని ఆధారంగా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య సరసన ఒక హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసింది చిత్రబృందం.. అయితే మరో పాత్రకి గాను సీనియర్ నటి సిమ్రాన్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న బాలయ్య, బోయపాటి సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారని సమాచారం..

Show Full Article
Print Article
Next Story
More Stories