ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ పై రగడ!

K V D Varma
Published on: 23 July 2019 9:57 AM IST
ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ పై రగడ!
X

పూరిజగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇటీవల విడుదలై విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ పై ఇప్పుడు రగడ మొదలైంది. ఆ కాన్సెప్ట్ తనదేనంటూ హీరో ఆకాష్ (ఆనందం ఫేం) తమిళ నిర్మాత మండలిలో ఫిర్యాదు చేశారు.

''ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్చే కాన్సెప్ట్‌తో తెలుగు–తమిళ భాషల్లో లేడీ డైరెక్టర్‌ రాధ నాతో సినిమా తీశారు. 'నాన్‌ యార్‌' పేరుతో తమిళ చిత్రం విడుదల కాగా, 'కొత్తగా ఉన్నాడు' పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈలోపు ఇలాంటి మూలకథతో 'ఇస్మార్ట్‌ శంకర్‌' రిలీజ్‌ కావడం మాకు షాక్‌ తగిలినట్లయింది'' అంటూ ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో ఆకాష్ చెప్పారు. ఇక్కడ తనకున్యాయం జగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.

K V D Varma

K V D Varma

Next Story