Dookudu Bollywood Remake : బాలీవుడ్ లోకి మహేష్ దూకుడు..

Dookudu Bollywood Remake : తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడుతుంది.. అక్కడ వరుసగా తెలుసు సినిమాలు రీమేక్ అవుతున్నాయి.

Krishna
Published on: 10 Aug 2020 3:32 PM IST
Dookudu Bollywood Remake : బాలీవుడ్ లోకి మహేష్ దూకుడు..
X
Mahesh Babu Dookudu Movie Poster

Dookudu Bollywood Remake : తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడుతుంది.. అక్కడ వరుసగా తెలుసు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రీమేక్ అయి మంచి హిట్ కాగా మరికొన్ని సినిమాలు మేకింగ్ దశలో, మరికొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. అయితే లేటెస్ట్ సినిమాలను మాత్రమే కాదు ఓల్డ్ సినిమాలను కూడా ఇప్పుడు రీమేక్ చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ ఆసక్తిగా చూపిస్తున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'దూకుడు' చిత్రం కూడా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాని హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ రీమేక్ చేస్తుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలో సినిమా పట్టాలేక్కనుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నాడని, దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో ఈ సినిమాని సల్మాన్ ఖాన్ తో రీమక్ చేయాలనీ భావించారు. కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు.

యాక్షన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ బాబుకి భారీ విజయాన్ని అందించింది. ఇందులో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు. ఇందులో సోనూసూద్ విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు.

Krishna

Krishna

Next Story