Sekhar Kammula: హిట్ తర్వాత ఫ్లాప్ సెంటిమెంట్ తో సెగ పెరిగిందా?

Sekhar Kammula: శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ తర్వాత అడ్రస్ లేడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో ఏదో ప్రయోగం చేయబోతున్నాడన్నారు.

Arun Chilukuri
Updated on: 17 Jun 2023 7:31 PM IST
Has Dhanush Movie With Shekhar Kammu Fallen to the Corner
X

Sekhar Kammula: హిట్ తర్వాత ఫ్లాప్ సెంటిమెంట్ తో సెగ పెరిగిందా?

Sekhar Kammula: శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ తర్వాత అడ్రస్ లేడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో ఏదో ప్రయోగం చేయబోతున్నాడన్నారు. కాని తను కేప్టెన్ మిల్లర్ ని మూడు భాగాలుగా చేయటంతో బిజీ అయ్యాడు. అక్కడే శేఖర్ కమ్ముల గజిబిజి అవుతున్నాడనంటున్నారు. శేఖర్ కమ్ముల కెరీర్ బిగినింగ్ నుంచి హిట్ వెంటనే ఫ్లాపు పడటం కామనైంది. ఆ సెంటిమెంటే ధనుష్ ని ఆపుతోందనే మాట వినిపిస్తోంది. ఇదంతా నిజమేనా అంటే, ఆనంత్ హిట్ తర్వాత గోదావరి ఫ్లాప్ నుంచి ఈ సెంటిమెంట్ ఒకటికి నాలుగు సార్లు ప్రూవ్ అయ్యింది. ఆ బ్యాడ్ లక్కే శేఖర్ కమ్ముల జోరుకి బ్రేక్ వేస్తోందనే మాట వినిపిస్తోంది.

హ్యాపీ డేస్ హిట్ తర్వాత శేఖర్ తీసిన మూవీ లీడర్. ఇది పేరు గొప్ప వసూళ్ళు దిబ్బ అనేలా షాక్ ఇచ్చింది. ఇలా ఆల్ మోస్ట్ ఒక హిట్ తర్వాత ఒక ఫ్లాప్ పడటం కామనైపోయింది. శేఖర్ కమ్ముల కెరీర్ లో నాలుగైదు సార్లు హిట్ వెంటనే ప్లాప్ రావటంతో అదో సెంటిమెంట్ గా మారింది. లైప్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత అనామిక ప్లాప్ అవటంతోనే ఇక కష్టం అనుకున్నటైంలో ఫిదాతో హిట్ మెట్టెక్కాడు శేఖర్ కమ్ముల. కట్ చేస్తే ఆతర్వాత మాత్రం బ్యాడ్ లక్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలిగాడు.

ఫిదా లాంటి హిట్ పడ్డాక లవ్ స్టోరీ ప్లాప్ అనుకున్నారు. కాని ఇది గట్టెక్కి హిట్ తర్వాత ఫ్లాప్ అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. సో అలాచూస్తే ఈ దర్శకుడితో ధనుష్ మూవీ కి సెంటిమెంటే బ్రేక్ వేసిందనలేం.. కాని అదే నిజమనుకోవాల్సి వస్తోందట. ఫిద తర్వాత లవ్ స్టోరీ గట్టెక్కిందంటే, ఆతర్వాత పంచ్ పడుతుందా అన్న కోణంలో సెంటిమెంట్స్ భయపెడుతున్నాయట. శేఖర్ కమ్ముల చెప్పిన కథలో మార్పులు చెప్పి ధనుష్ అలా ఆ ప్రాజెక్ట్ కి బ్రేకులేశాడా? హోల్డ్ లో పెట్టాడా అంటూ డౌట్లకు గేట్లు తెరుచుకుంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story