Vijay Deverakonda vs Anasuya: అనసూయకు ఇచ్చిపడేసిన పవన్ డైరెక్టర్ ..

Vijay Deverakonda vs Anasuya: విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ వివాదం కొత్త టర్న్ తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 10 May 2023 9:31 PM IST
Harish Shankar Counter to Anasuya Bharadwaj
X

Vijay Deverakonda vs Anasuya: అనసూయకు ఇచ్చిపడేసిన పవన్ డైరెక్టర్ ..

Vijay Deverakonda vs Anasuya: విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. విజయదేవరకొండ ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు హీరో పేరు ముందు ది అనే ఆంగ్ల పదం పెట్టడం పై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. పిచ్చి పీక్స్ అని ఎద్దేవా చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ అనసూయను ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి కూడా అనసూయ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిజానికి విజయదేవరకొండ విషయంలో మొదటి నుంచి అనసూయ ఎందుకో స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాలో డైలాగ్ పై అనసూయ అప్పట్లో అభ్యంతరం తెలిపింది. ఆ తర్వాత లైగర్ ఫ్లాప్ కావడంపై ఈ జబర్దస్త్ యాంకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పై దేవరకొండ ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఎపిసోడ్ లో అనసూయను అప్పట్లో నటుడు బ్రహ్మాజీ తప్పుబట్టారు కూడా. ఇక తాజాగా ఖుషి చిత్రం ప్రమోషన్స్ ను టార్గెట్ చేస్తూ అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట మంటలు రేపుతోంది.

తాజా వివాదంలో విజయదేవరకొండకు పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మద్దతుగా నిలిచారు. విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ అనసూయకు సెటైర్ వేశారు. తన బర్త్ డే మెసేజ్ లో పలుమార్లు ది ఆంగ్ల పదాన్ని హైలైట్ చేశారు. తాజా వివాదంలో తప్పు అనసూయదే అన్నట్లుగా హరీష్ చెప్పకనే చెప్పారు. మరి దీనికి అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story