తెలుగు తెరపై మాటల మూటల 'త్రివిక్రమం'

తెలుగు తెరపై మాటల మూటల త్రివిక్రమం
x
Highlights

సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఇంటికి వెళ్ళాకా కూడా తన మాటల్ని తలుచుకుని నవ్వుకునేలా, ఆ ఆణిముత్యాలను హృదయంలో దాచుకునేలా చేయగలిగిన ఒకే ఒక్కడు త్రివిక్రమ్

మాట శక్తి వంతమైంది.. ఎంత అంటే తుపాకీ తూటా కంటే, గుండెల్ని తూట్లు పొడుస్తుంది.. అదే మాట గుండెలోతుల్లో బడబాగ్నిలా మండుతున్నమంటని చల్లారుస్తుంది.. ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచాలన్నా..ఆదూరాన్ని తుంచాలన్నా ఒక్క మాట చాలు.. జీవితంలో మాట కెంత ప్రాదాన్యమెంత ఉంటుందో సినిమాలోనూ డైలాగులకు అంత విలువ ఉంటుంది. తూటాలా పెలేమాట.. హృదయాన్ని హత్తుకునే పదబంధం.. మనసుల్ని కదిలించే డైలాగు ఇన్ని రకాలను కలిపి వడ్డిస్తేనే ప్రేక్షకుడు కథలో లీనమవగాలుగుతాడు. సినిమా అయిపోయిన తరువాత కూడా ప్రేక్షకులను వెంటాడే మాటలే సినిమా విజయానికి మెట్లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

ఇప్పుడు ఇదంతా ఎందుకో తెలుసా.. మాటలతో మంత్రం వేసి.. పాత్రల మధ్య బంధాన్ని పంచ్ లతో పంచి.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఇంటికి వెళ్ళాకా కూడా ఆ మాటల మూటల్ని తలుచుకుని నవ్వుకునేలా.. ఆ ఆణిముత్యాలను హృదయంలో దాచుకునేలా చేయగలిగిన ఒకే ఒక్కడు త్రివిక్రమ్ గురించి చెప్పడానికే! ఈ రోజు(నవంబర్ 7) ఆ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ సంగతులు కొన్ని..

''అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరం లేదు!'' ఇది త్రివిక్రమ్ సూపర్ హిట్ డైలాగుల్లో ఒకటి. సరిగ్గా ఆయనకు సరిపోయేది. సినిమాల్లో ఎదో సాధించేయాలని వచ్చిన ఆయనకు అక్కడేమీ ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకలేదు ఎవ్వరూ. ఎందరో సినీ వ్యామోహకుల్లో ఒకరిలా వచ్చారు. స్నేహితులతో కలసి ఉంటూ తినీ..తినక తన లక్ష్యం కోసం శ్రమించారు. ''జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకా ఓ మినీ యుద్ధమే ఉంటుంది'' అని నమ్మిన త్రివిక్రమ్ తన సౌకర్యవంతమైన సినీ జీవితం కోసం యుద్ధమే చేశారు. ''మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం..బలంగా కోరుకునేదే భవిష్యత్!'' అనుకున్న ఆయన తన భవిష్యత్ కోసం బలంగా కోరుకున్నారు. దానికోసం ఇష్టంగా శ్రమించారు. దాంతో అదృష్టమూ తలుపు కొట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే ఓ అద్భుతం జరగబోతోందని పరిశ్రమలో చాలా మంది ముందు గుర్తించలేదు. కానీ, తరువాత వారు గుర్తించాల్సిన అవసరమూ త్రివిక్రమ్ కి రాలేదు. ఎందుకంటే, లక్షలాది సినీ అభిమానుల మనసులు మెచ్చిన నేస్తం అయిపోయారు అయన. రచయితగా రాసిన డైలాగులు ఇప్పుడు ఎందరి నోటిలోనో నానుతూ ఉన్నాయి.

దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అన్నీ (సోకాల్డ్ లెక్కల్లో పోయిందని పెదవి విరిచిన ఒకటీ అరా సినిమాలు కూడా) టీవీలో వస్తే.. ఎన్నిసార్లు వచ్చినా సరే కదలకుండా టీవీకి అతుక్కు పోయేవారెందరో ఆ సినిమా ప్రసారమైన చానల్ రేటింగులు చెబుతాయి. అయన డైలాగులో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందని అయన అభిమానులు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఒక్కో సినిమాకి అయన కలం మరింత పదును తేలుతూనే ఉంది. హీరో ఎవరైనా సరే.. సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ అయితే, ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు ప్రేక్షకులు. ఈ కిక్కు కోసమే త్రివిక్రమ్ సినిమాని వదలకుండా ఎన్నిసార్లయినా చూస్తారు. మహేష్ లాంటి హీరోతో అతడు చేసినా.. వెంకటేష్ ని మల్లీశ్వరితో కలిపినా.. పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేదీ చూపించినా.. అళ్లు అర్జున్ లాంటి స్టయిలిష్ స్టార్ ను జులాయిగా మార్చేసినా అది త్రివిక్రమ్ మాయే అవుతుంది. ఈ మాయలో పడిపోని తెలుగు ప్రేక్షకులు లేరు. ఆ సినిమాల్లో మాటలకు అభిమానులు కాని తెలుగు వారూ లేరు. పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ మరిన్ని మాటల తూటాలతో సినీ పరిశ్రమలో దూసుకుపోవాలని కోరుకుంటూ..

మీ కోసం కొన్ని త్రివిక్రమ్ మాటల ముత్యాలు..

యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు

విచ్చలవిడిగా నరికితే హింస.. విచక్షణతో నరికితే ధర్మం..

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు

తెలిసి చేస్తే అది మోసం..తెలియక చేస్తే అది తప్పు!

కారణం లేని కోపం.. గౌరవం లేని ప్రేమ.. బాధ్యత లేని యవ్వనం..

జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం

అందంగా లేదని అమ్మని..కోపంగా ఉన్నాడని నాన్ననీ వదిలేయలెం కదా!

నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం!

పని చేసి జీతం అడగొచ్చు..అ ప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు.. కానీ, హెల్ప్ చేసి థాంక్స్ మాత్రం అడగకూడదు.

దేవుడు కళ్లున్నాయని సంతోషించే లోపల కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తాడు

తండ్రికి, భవిష్యత్ కీ భయపడని వాడు జీవితంలో పైకి రాలేదు..

కన్నతల్లినీ, గుళ్ళో దేవుడినీ మనే వెళ్లి చూడాలి.. వాళ్ళే మన దగ్గరకి రావాలనుకోవడం మూర్ఖత్వం..

బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నవని అడగడం అమాయకత్వం.. బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగడం అనవసరం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories