Nani: నాచురల్‌ స్టార్‌ నానికి బర్త్ డే విషెస్

Nani: నాచురల్‌ స్టార్‌ నానికి బర్త్ డే విషెస్
x
Highlights

వారసులకు పెద్దపీట వేసే మాయా ప్రపంచం టాలీవుడ్.. అడపాదడపా ఒకరిద్దరు సాహసం చేయరా ఢింబకా అన్నట్టు హీరో అవుదామని టాలీవుడ్ గడప తొక్కినా..వారెవరూ వారసుల దరిదాపుల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు.

వారసులకు పెద్దపీట వేసే మాయా ప్రపంచం టాలీవుడ్.. అడపాదడపా ఒకరిద్దరు సాహసం చేయరా ఢింబకా అన్నట్టు హీరో అవుదామని టాలీవుడ్ గడప తొక్కినా..వారెవరూ వారసుల దరిదాపుల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే.. నానీ అనే ఓ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో దానికి మినహాయింపుగా నిలిచింది. చిన్న సహాయ దర్శకుడిగా మొదలైన నానీ ప్రస్థానం తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న యువ హీరోల్లో మేటిగా నిలిచింది. సహజమైన నటన నానీ బలం. స్వచ్ఛమైన నానీ నవ్వు ఆయన అభిమానులకు సంబరం. కథల్ని ఎంపిక చేసుకోవడం..వైవిధ్యం నానీ నమ్మిన దారి. తెలుగు తెర సహజ నటుడు.. మిడిల్ క్లాస్ మెచ్చిన అబ్బాయి.. హీరో నానీ పుట్టినరోజు ఈరోజు (24.02). ఈ సందర్భంగా నానీ గురించి నాలుగు మాటలు..

ఫిబ్రవరి 24,1984 సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించాడు నాని.. కానీ నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా.. సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాని శ్రీనువైట్ల, బాపు దగ్గర ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత విభిన్నమైన కథలను తెరకెక్కించే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చమ్మా సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఈ సినిమాలో రాంబాబు అనే పల్లెటూరు అబ్బాయిగా నటించి మెప్పించాడు నాని.. సినిమా మంచి హిట్ కావడంతో వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో నాని స్థాయి మరింతగా పెరిగింది.

ఇక భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్ మేన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, MCA లాంటి చిత్రాలతో వరుస హిట్లను సొంతం చేసుకున్నాడు. గత గత ఏడాది వచ్చిన జెర్సీ సినిమాతో నాని స్థాయి మరింతగా పెరిగింది. ఆ సినిమాలో నాని నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. నాని హీరోగానే కాకుండా నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని నిర్మిస్తూ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు అదే బాటలో HIT అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు నాని..

ఇక ప్రస్తుతం నాని హీరోగా వి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది నానికి 25 వ చిత్రం కావడం విశేషం.. దీనికి కూడా తన మొదటి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. ఉగాది సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇదే కాకుండా టక్ జగదీశ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. నాని ఇలాగే మరిన్ని సినిమాలు చేసి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది హెచ్.ఎం. టీ.వీ.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories