Gunjan Saxena Trailer : ఆకట్టుకున్న జాన్వీకపూర్‌ గుంజ‌న్ సక్సేనా ట్రైల‌ర్‌‌

Gunjan Saxena Trailer : సినీ ప్రేక్షకులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ ట్రైలర్ వచ్చేసింది. చిత్ర ట్రైలర్ ని

Krishna
Published on: 1 Aug 2020 8:32 PM IST
Gunjan Saxena Trailer  : ఆకట్టుకున్న జాన్వీకపూర్‌ గుంజ‌న్ సక్సేనా ట్రైల‌ర్‌‌
X
Gunjan Saxena The Kargil Girl trailer

Gunjan Saxena Trailer : సినీ ప్రేక్షకులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' ట్రైలర్ వచ్చేసింది. చిత్ర ట్రైలర్ ని చిత్రబృందం ఈరోజు (శనివారం)న రిలీజ్ చేసింది. జాన్వీకపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా శరణ్‌ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ధియేటర్లు ఓపెన్ గా లేకపోవడంతో ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్‌లో ఆగస్టు 12న విడుదల చేయబోతున్నారు.

ఇక రెండు నిమిషాల నలబై ఒక్క సెకండ్స్ ఉన్న చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 'మీరు ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకుంటే మీరొక సైనికుడు అవ్వాలి. లేదంటే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి' అన్న డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి పైలెట్‌ కావాలనుకున్న గుంజన్‌ సక్సేనా ఎలాంటి ప్రయత్నాలు చేసింది. శిక్షణ సమయంలో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదురుకుంది. అవన్నీ ఎదురుకొని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా పైలెట్‌గా ఎలా నిలిచింది అన్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జాన్వీ కపూర్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఈ సినిమాలో జాన్వీతో పాటు అంగద్‌ బేడీ, మానవ్‌ విజ్‌, పంకజ్‌ త్రిపాఠి, రజత్‌ బర్మేచా, నీనా గుప్తా, విజయ్‌ వర్మలు కూడా నటిస్తున్నారు. అటు గుంజ‌న్ చేసిన సేవ‌ల‌కి గాను ఆమెకి శౌర్యచక్ర పురస్కారం లభించింది.



Krishna

Krishna

Next Story