logo
సినిమా

సల్మాన్ ఖాన్ సినిమా రీమేక్ చేయనున్న గోపీచంద్

సల్మాన్ ఖాన్ సినిమా రీమేక్ చేయనున్న గోపీచంద్
X
Highlights

ఈ మధ్యకాలంలో మాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి అసలు బాగోలేదు. చేసిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని...

ఈ మధ్యకాలంలో మాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి అసలు బాగోలేదు. చేసిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోతోంది. ఈ మధ్యనే 'పంతం' సినిమాలో కనిపించి పరవాలేదనిపించాడు గోపీచంద్. అయితే ప్రస్తుతం ఈ హీరో తమిళ దర్శకుడైన తిరు తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక బాలీవుడ్ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది.

అది మరేదో కాదు కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్ థా టైగర్' సినిమా రీమేక్ ని గోపీచంద్ తెలుగులో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ స్టోరీ డిస్కషన్ లు ప్రస్తుతం జరుగుతున్నాయని సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా టాలీవుడ్ లో కూడా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని గోపీచంద్ ఈ సినిమా పైన బోలెడు ఆశలు పెట్టుకున్నాడట.

Next Story