Tollywood: "పక్కా కమర్షియల్" గా వస్తున్న గోపీచంద్

Sandeep Reddy
Published on: 18 July 2021 5:53 PM IST
Gopichand and Director Maruthi Latest Movie Pakka Commercial Poster Released
X

పక్కా కమర్షియల్ సినిమా పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Tollywood: "ప్రతి రోజు పండుగే" సినిమా సూపర్ హిట్ తర్వాత దర్శకుడు మారుతి గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీచంద్ తన సినిమా రంగంలోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా యూవి క్రియేషన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ని విడుదల చేసింది. యూవి క్రియేషన్స్, జీఏ 2 బ్యానర్ లో సంయుక్తంగా తెరకిక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా హైదరాబాద్ లో షూటింగ్ ని జరుపుకుంటుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశి కన్నా హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా విడుదల చేసిన "పక్కా కమర్షియల్" పోస్టర్ లో గోపీచంద్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.



మరోపక్క ఈ సినిమా తర్వాత గోపీచంద్ తన 30వ చిత్రాన్ని లౌక్యం, లక్ష్యం వంటి సూపర్ హిట్ సినిమాలను గోపీచంద్ అందించిన దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. దాదాపుగా "పక్కా కమర్షియల్" సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తుండటంతో ఆ సినిమా తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇక తెలుగులో చావు కబురు చల్లగా, టాక్సీవాలా వంటి సినిమాలకి సంగీతాన్ని అందించిన జాక్స్ బిజోయ్ "పక్కా కమర్షియల్" చిత్రానికి తన సంగీతాన్ని అందించనున్నాడు. ఇప్పటి వరకు సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న గోపీచంద్ త్వరలో రానున్న ఈ రెండు చిత్రాలతో మంచి విజయాలు సాధించాలనే కసితో ఉన్నట్లు తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story