Gold Rates Today 22.10.2019 : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగానే వెండి ధరలు!

బంగారం ధరలు మంగళవారం కొద్దిగా దిగొచ్చాయి. 22.10.2019 మంగళవారం బంగారం పది గ్రాముల బంగారం ధర సరిగ్గా 40 వేల రూపాయలకంటే కొద్దిగా దిగింది. కాగా రెండో రోజూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,950 రూపాయల కు తగ్గింది.

K V D Varma
Updated on: 22 Oct 2019 8:04 AM IST
Gold Rates Today 22.10.2019 : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగానే వెండి ధరలు!
X

బంగారం ధరలు మంగళవారం కొద్దిగా దిగొచ్చాయి. 22.10.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర 40 వేల రూపాయలకంటే కొద్దిగా దిగింది. కాగా మూడో రోజూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,950 రూపాయల కు తగ్గింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 40 రూపాయలు తగ్గింది. ఈ తగ్గుదలతో 36,620 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధర శనివారం ధరల దగ్గరే మూడో రోజూ స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో మంగళవారం కేజీ వెండి ధర 48,000 రూపాయల వద్దనే నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,950 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,620 రూపాయలుగానూ ఉన్నాయి

ఢిల్లీ మార్కెట్ లో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,600 రూపాయల వద్ద 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గడంతో 37,400 రూపాయల వద్దకు తగ్గింది. ఇక వెండి ధర కూడా ఎటువంటి మార్పులకూ గురవలేదు. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,000 రూపాయలు వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22.10.2019 మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story