GodFather Collections: పాజిటివ్ టాక్ కూడా గాడ్ ఫాదర్ సినిమాని కాపాడలేకపోయిందా?

GodFather Collections: పాజిటివ్ టాక్ కూడా గాడ్ ఫాదర్ సినిమాని కాపాడలేకపోయిందా?

Arun Chilukuri
Published on: 13 Oct 2022 11:00 AM IST
GodFather Film Collections Drops at the Ticket Window
X

GodFather Collections: పాజిటివ్ టాక్ కూడా గాడ్ ఫాదర్ సినిమాని కాపాడలేకపోయిందా?

GodFather Box Office Collection: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.

కానీ తాజాగా సినిమా మొదటివారం వసూలు చేసిన కలెక్షన్లు చూస్తుంటే మాత్రం సినిమా ను హిట్ గా కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల 10 శాతం కలెక్షన్లు తగ్గిపోయాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సినిమా విడుదలైన 6, 7 రోజులు కలిపినా కూడా కలెక్షన్లు కేవలం 2.17 కోట్లు మాత్రమే నమోదు చేసుకుంది సినిమా. మొదటివారం పూర్తయ్యేసరికి సినిమా కలెక్షన్లు 49.5 కోట్లుగా తెలుస్తోంది.

ఎంత మంచి హిట్ టాక్ వచ్చినప్పటికీ సీనియర్ స్టార్ హీరో సినిమా మొదటివారం 50 కోట్లు కూడా దాటకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురిచేస్తుంది. ఇక సినిమా ఫైనల్ రన్ లోపల కలెక్షన్లు 60 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ సినిమా రైట్స్ 80 కోట్లకు అమ్ముడయ్యాయి కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ అని కూడా చేరుకోలేక ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story