Godfather 1st Day Collections: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..

Godfather 1st Day Collections: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..

Arun Chilukuri
Updated on: 6 Oct 2022 8:30 PM IST
GodFather 1st Day World Wide Box Office Collections
X

Godfather 1st Day Collections: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..

Godfather 1st Day Collections: ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యనే "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించ లేకపోయింది. తాజాగా చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నిన్న అనగా అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదల అయింది. నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, మురళి శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముతిరఖని, తదితరులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల పరంగా కూడా బాగానే ముందుకు దూసుకు వెళ్తోంది. మొదటి రోజున సినిమా కలెక్షన్లు 13 కోట్లు కాగా అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్లు వసూళ్లు చేసింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్లు 17.8 కోట్లు కాగా గ్రాస్ 31.9 కోట్లు.

సినిమా కలెక్షన్లు ఏరియా వైస్ గా ఇలా ఉన్నాయి:

నిజాం: 3.25 కోట్లు

వైజాగ్: 1.25 కోట్లు

తూర్పు: 1.60 కోట్లు

వెస్ట్: 0.80 కోట్లు

కృష్ణ: 0.73 కోట్లు

గుంటూరు: 1.75 కోట్లు

నెల్లూరు: 0.57 కోట్లు

ఆంధ్ర: 6.70 కోట్లు

సీడెడ్: 3.05 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో: 13 కోట్లు

కర్ణాటక: 1.8 కోట్లు

అమెరికా: 1.6 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.2 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: 17.6 కోట్లు (31.9 కోట్లు గ్రాస్)

అయితే సినిమా థియట్రికల్ రైట్స్ 92 కోట్లు విలువ చేయడంతో మొదటి రోజు కలెక్షన్లు పర్వాలేదు అనిపిస్తున్నాయి. మరి సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటగలదో లేదో చూడాలి. టాక్ కూడా బాగానే ఉండటంతో సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story