Allu Sirish's Go Local Be Vocal Moment: 'గో లోక‌ల్ బీ వోక‌ల్' దేశీయ వ‌స్తువు నినాదంతో అల్లు శిరీష్‌

Allu Sirish's Go Local Be Vocal Moment: యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ ప్రారంభించిన ‘గో లోక‌ల్ బీ వోక‌ల్’ అనే ఉద్య‌మానికి విశేష స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ‘గో లోకల్ బీ వోకల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో శిరీష్ మొద‌లుపెట్టిన ఈ ఉద్యమం ట్రెండింగ్‌గా మారింది

Samba Siva Rao
Published on: 17 Aug 2020 11:59 PM IST
Allu Sirishs Go Local Be Vocal Moment: గో లోక‌ల్ బీ వోక‌ల్ దేశీయ వ‌స్తువు నినాదంతో అల్లు శిరీష్‌
X
'గో లోక‌ల్ బీ వోక‌ల్’ దేశీయ వ‌స్తువు నినాదంతో అల్లు శిరీష్‌

Allu Sirish's Go Local Be Vocal Moment: యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ ప్రారంభించిన 'గో లోక‌ల్ బీ వోక‌ల్' అనే ఉద్య‌మానికి విశేష స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో 'గో లోకల్ బీ వోకల్' అనే హ్యాష్ ట్యాగ్‌తో శిరీష్ మొద‌లుపెట్టిన ఈ ఉద్యమం ట్రెండింగ్‌గా మారింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సూచన మేరకు ప్రతి భారతీయుడు వీలైనంత వరకు విదేశి బ్రాండ్ల వాడకాన్ని తగ్గించి, స్వదేశీయేతర ఉత్పత్తులను వాడాలని, అంతేగాని ప్రతి అవ‌స‌రానికి విదేశీ ఉత్పత్తలు వాడకూడదని శిరీష్ పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా అల్లు శిరీషే స్వ‌యంగా మార్కెట్ కెళ్లి.,, ఏరికోరి మ‌రి భారతీయ బ్రాండ్లను వెతికి కొన్నారు. వీలైనంత వరకు అందరూ భారతీయ బ్రాండ్లను వాడండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇక నుంచి మ‌నం స్వ‌దేశి ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నామనీ, ఈ విష‌యాన్ని ‌గ‌ర్వంగా బ‌య‌ట‌కి వెల్ల‌డించాల‌ని శిరీష్ అన్నారు. ఈ ఉద్య‌మాన్నీ మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని కోరారు.

ఇందులో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, రకుల్ ప్రీత్, అను ఇమ్మానుయేల్, రాశి ఖన్నా, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి, ఉపాసన కొణిదెల కు స్వ‌దేశీ వ‌స్తువుల‌ను ఈ చాలెంజ్ విసిరారు. . వీరితో పాటు ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కూడా ఉండటం విశేషం. ఈ సెలెబ్రెటీస్ అంతా గిఫ్ట్ హంపర్ అందుకోవడమే కాకుండా ఇలాంటి అద్భుతమైన మూమెంట్ కి నాంది పలికిన అల్లు శిరీష్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

యంగ్ హీరో అల్లు శిరీష్ గో లోకల్ బీ వోకల్ మూమెంట్ లో తారలకు పంపిన గిఫ్ట్ హంపర్ లో ఉన్న దేశీయ ఉత్పత్తుల జాబితా:

పల్ప్ ఇండియా ,

ఉస్తారా – కొలోన్

బొంబాయి షేవింగ్ కంపెనీ ఫేస్ వాష్ అండ్ మాస్క్

గ్రీన్ స్నాక్ కో – క్వినోవా పఫ్స్ అండ్ స్నాక్స్

కవర్ ఇట్ అప్ : సెల్ ఫోన్ కవర్లు

ఆర్గానిక్ ఇండియా : ఆయుష్ క్వాత్, గ్రీన్ టీ, మగ్స్, బాడీ ఆయిల్

ఇదిలా ఉండగా శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌‌తో పాటు కీల‌క విష‌యాలు అతిత్వ‌ర‌లో రాబోతున్నాయి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story