Allu Arjun: అల్లు శిరీష్ పక్కన అల్లు అర్జున్ భామ

Allu Arjun: అల్లు శిరీష్ పక్కన అల్లు అర్జున్ భామ
x
Allu arjun, sirish
Highlights

నాని హీరోగా వచ్చిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌.. మొదటి సినిమాతో ఇటు అందం అటు అభినయంతో

నాని హీరోగా వచ్చిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌.. మొదటి సినిమాతో ఇటు అందం అటు అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కిట్టుగాడు జాగ్రత్త, గోపీచంద్ తో ఆక్సిజన్ లాంటి సినిమాలు అయితే వచ్చాయి కానీ సక్సెస్ లు అయితే రాలేదు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అజ్ఞాతవాసి' లో హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ ఆమె దురదృష్టం కొద్ది ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. ఇక అక్కినేని నాగచైతన్యతో చేసిన శైలజారెడ్డి అల్లుడు, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. ఇక ఈ సినిమాల తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్‌ మళ్ళీ వెండితెరపై కనిపించింది లేదు..

అయితే ఇప్పుడు తన కెరియర్ ని స్పీడ్ పెంచాలని అనుకుంటుందట.. అందులో భాగంగానే అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా ఎంపికైందట.. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయమైన 'విజేత' చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన రాకేశ్‌ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుందట.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.. ఓ తమిళ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుందని సమాచారం..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ గ్రాండ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు నటుడుగా మంచి పేరును అయితే తెచ్చాయి కానీ భారీ హిట్ ని అందిచలేకపోయాయి. ఇక గతేడాది మల‌యాళ చిత్రం `ఏబీసీడీ` రీమేక్‌లో న‌టించిన అది ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేకపోయింది. దాంతో కొంత విరామం తీసుకున్న శిరీష్ ఇప్పుడు పక్కా స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories