శర్వానంద్ సినిమాకి 8 కోట్లు

శర్వానంద్ సినిమాకి 8 కోట్లు
x
Highlights

ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'పడి పడి లేచే మనసు' విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి సినిమాతో కచ్చితంగా...

ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'పడి పడి లేచే మనసు' విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించాలని శర్వానంద్ ప్లాన్ చేస్తున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ తో శర్వానంద్ ఒక సినిమా ప్రాజెక్ట్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు.

ఇంతకుముందు సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ ఎఫెక్టు ఈ సినిమాపై పడలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు 8 కోట్లకు అమ్ముడు అయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ జెమినీ ఈ సినిమా హక్కుల్ని చేజిక్కించుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ మొట్టమొదటి సారిగా ఒక మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రకరకాల షేడ్స్ ఉన్న అవతారాల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా 'హలో' బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. ప్రశాంత్ పిళ్ళై ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories