హిందీ లో కూడా సినిమాను వాళ్లే నిర్మిస్తారట

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్లో కి ఎప్పుడు అడుగుపెడతాడు తెలియదు కానీ అతని సినిమాలన్నీ ఇప్పటికే బాలీవుడ్ లో రీమేక్ అయిపోతున్నాయి. తెలుగులో 'అర్జున్ రెడ్డి' కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి ఇప్పుడు అదే సినిమాను మళ్ళీ హిందీలో తీస్తున్న సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 5 Jan 2019 1:24 PM IST
Geetha Govindam
X
Geetha Govindam

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్లో కి ఎప్పుడు అడుగుపెడతాడు తెలియదు కానీ అతని సినిమాలన్నీ ఇప్పటికే బాలీవుడ్ లో రీమేక్ అయిపోతున్నాయి. తెలుగులో 'అర్జున్ రెడ్డి' కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి ఇప్పుడు అదే సినిమాను మళ్ళీ హిందీలో తీస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ను వందకోట్ల క్లబ్ లో జాయిన్ చేసిన సినిమా 'గీతగోవిందం' కూడా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే 'అర్జున్ రెడ్డి' రీమేక్లో షాహిద్ కపూర్ నటిస్తుండగా అతని తమ్ముడు ఇషాన్ కట్టర్ కి 'గీత గోవిందం' రీమేక్లో నటించే అవకాశం వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ హిందీ రీమేక్ కూడా నిర్మించనుంది అని తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ మీడియా తెలుగులో 'గీతగోవిందం' సినిమా సమర్పించిన గీత ఆర్ట్స్ బ్యానర్ హిందీ రీమేక్ ను కూడా నిర్మించనుంది అని కోడై కూస్తుంది. అయితే దీని తాలూకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక రష్మిక మందన్న పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

Ruthvik

Ruthvik

Next Story