logo
సినిమా

మెగా హీరో సినిమాలో గబ్బర్ సింగ్ గ్యాంగ్

మెగా హీరో సినిమాలో గబ్బర్ సింగ్ గ్యాంగ్
X
Highlights

ఎప్పుడో 2016లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'డీజే దువ్వాడ జగన్నాధం' సినిమాకి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఆ...

ఎప్పుడో 2016లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'డీజే దువ్వాడ జగన్నాధం' సినిమాకి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఆ సినిమాతో అంతగా మెప్పించలేదు. ఇక మళ్ళీ కొంత కాలం గ్యాప్ తీసుకున్న హరీష్ ఇప్పుడు ఒక రీమేక్ సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'జిగర్తండా' సినిమా ను తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో బాబీ సింహ పాత్రలో కనిపిస్తాడు.

ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఈనెల 21 నుండి పట్టాలెక్కనుంది. దాదాపుగా వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. వరుణ్ తేజ్, తనికెళ్ల భరణి తో పాటు గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. తమిళంలో సిద్దార్థ నటించిన పాత్రలో శ్రీ విష్ణు నటించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమా ను నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా విడుదల కానుంది.

Next Story