నవ్వి'తేన'వ్వండి

నవ్వితేనవ్వండి
x
Highlights

నవ్వు నాలుగు విధాల స్వీటే కాదు అన్నిరకాలుగా నూ ఆరోగ్యకారణం కూడానూ. ఎంతో ఒత్తిడితో సతమతమయ్యే మనకు నాలుగు నవ్వు తెప్పించే కబుర్లు వుంటే.. మనసు ఉల్లాసంగా ఉంటుంది.. ఏమంటారు? అందుకే మీ కోసం కొన్ని సరదా జోక్స్..

అమ్మ మాట, బిర్యానీ మూట!

కొద్దిమంది పిల్లలు రోజు స్కూల్ వెళ్ళడానికి ఇష్టపడక...రకరకాల కారణాలు చెప్పి ఆ రోజు సెలవు తీసుకుందామని ట్రై చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే, మన రాజు ఒక రోజు వాళ్ళ మమ్మీ తో ట్రై చేసాడు...అదెలాగో ఇప్పుడు చూద్దాం.

రాజు: అమ్మా! ఈ రోజు కడుపునొప్పిగా ఉంది స్కూలుకు వెళ్లను…

తల్లి: అయ్యో! బిర్యానీ చేశానే ఎలా?

రాజు: కడుపు నొప్పి కాదు మమ్మీ, కాలు నొప్పి అన్నాడు.

తల్లి: నేను చేసింది బిర్యానీ కాదు అన్నమే! అంది తెలివైన తల్లి.

కొంచం కూరుంటేయమ్మో!

మనుషుల్లో రకరకాల వ్యక్తులు ఉన్నట్టే... బిచ్చగాల్లల్లో కూడా రకరకాల వ్యక్తులు వుంటారు... అలాంటి ఒక బిచ్చగాడు ఏమి చేసాడో ఇప్పుడు చూద్దాము.

బిచ్చగాడు : అమ్మా! కొంచెం అన్నం పెట్టమ్మా…

శారద : ఇప్పుడు లేదు పోవయ్యా!

బిచ్చగాడు : పోనీ కొంచెం కూరైనా ఇవ్వమ్మా

శారద : కూర లేదు... ఏమీలేవు పోవయ్యా.

బిచ్చగాడు : ఏమీ లేనప్పుడు మీరూ ఇక్కడ ఏమి చేస్తారమ్మ, నాతో రండి కలిసి ఎంచక్కా అడుక్కున్దాం.

ఓస్! ఇది ఒక సమస్యేనా!

మహెష్: రమేష్..... నీభార్య అంటే నీకంత ఇష్టమా?

ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు.. రమేష్.

మహెష్: ఏమి లేదు..... ఆవిడ ఫోటోను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటావు కదా?

రమేష్: ఇష్టం కాదురా కష్టం. నాకు ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు, వెంటనే ఆవిడ ఫోటో చూస్తాను. ఆ సమస్య చాలా చిన్నదిగా అనిపించి మనస్సు తేలికపడుతుంది అన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories