Bigg Boss Telugu 7: బేబీ హీరోయిన్ నుంచి.. మొగలి రేకులు హీరో వరకు.. బిగ్‌బాస్ 7లో సందడి చేసేది వీరేనంట?

From Baby Heroine to Mogali Rekelu to Hero These Celebrities in Bigg Boss 7 Season
x

Bigg Boss Telugu 7: బేబీ హీరోయిన్ నుంచి.. మొగలి రేకులు హీరో వరకు.. బిగ్‌బాస్ 7లో సందడి చేసేది వీరేనంట?

Highlights

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో 6 సీజన్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో 6 సీజన్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఏడో సీజన్‌లోనూ నాగార్జున హోస్ట్‌గా కనిపించనున్నాడు. సెప్టెంబర్‌లో బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

బిగ్‌బాస్ షో తెలుగులో ఎంట్రీ ఇచ్చే సమయంలో అందరికీ ఎన్నో అనుమానాలు ఉండేవి. అయితే, ఆ సీజన్‌ను ఎన్టీఆర్ తన ధూమ్ ధామ్ యాంకరింగ్‌తో బంపర్ హిట్ చేసి, బుల్లితెరపై టాప్ రేటేడ్ షోగా మార్చేశాడు. ఆ తర్వాత సీజన్‌లో న్యాచుర్ స్టార్ నాని సందడి చేశాడు. ఇక ఆ తర్వాత సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

బిగ్ బాస్‌లో 6వ సీజన్‌ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో సీజన్ 7పై మరింత ఫోకస్ చేసి, సరికొత్తగా ప్లాన్‌ చేశారంట. కాగా, ఈ సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లేవారిలో కొందరి పేర్లు ఇప్పటికే కన్ఫ్మాం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సీజన్‌ 7లో కొత్త గేమ్స్, కొత్త టాస్క్స్, కొత్త రూల్స్‌తో ప్రేక్షకులకు మరింత జోస్‌ ఇవ్వనున్నారంట. అంతేకాదు బిగ్ బాస్‌లో 7లో పాల్గోనే కంటెస్టెంట్స్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంట. ఈ లిస్ట్‌లోకి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వారిలో సీరియల్ నటుడు సాగర్ పేరు కూడా వినిపిస్తోంది. మొగలి రేకులు సీరియల్‌లో ఆర్.కే. నాయుడు పాత్రతో పాపులర్ అయిన సాగర్.. కొన్ని సినిమాల్లోను నటించాడు. కాగా, సాగర్ పేరు దాదాపు ఫిక్స్ అయిందని, రెమ్యూనరేషన్‌ కూడా 70 నుంచి 80 వేల మధ్యలో ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ పేరు కూడా వినిపిస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పేరుగాంచిన భాస్కర్.. తన కామెడీతో బిగ్‌బాస్‌ హౌస్‌లో నవ్వులు కురిపించనున్నాడంట.

కార్తీక దీపం సీరియల్ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతోగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ మోనితగా ఫేమస్ అయిన శోభాశెట్టి కూడా బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ లిస్ట్‌లో చేరిందంట.

తెలుగు యాంకర్ విష్ణుప్రియ పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది. పోవే పోరా ప్రోగ్రాంతో పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫేమస్ అయింది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. బిగ్‌బాస్‌ హౌ‌స్‌లో మాంచి మసలా ఇచ్చేందుకు రెడీ అయ్యిందంట.

‘అల వైకుంఠపురములో’ మూవీలో హీరో చెల్లెలి పాత్రలో నటించిన కూడా ఈ లిస్టులో చేరింది. బేబి సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైష‌్ణవి చైతన్య కూడా బిగ్‌బాస్ 7లో కనిపిచనుందంట.

Show Full Article
Print Article
Next Story
More Stories