ఒక్క సంవత్సరం లో నాలుగు సినిమాలు చేస్తున్న నందమూరి హీరో

ఒక్క సంవత్సరం లో నాలుగు సినిమాలు చేస్తున్న నందమూరి హీరో
x
Highlights

ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి కనీసం అరడజను సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడం కూడా గగనమైపోయింది. ఇలాంటి...

ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి కనీసం అరడజను సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడం కూడా గగనమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం 4 విడుదలతో రికార్డు సృష్టిస్తున్నాడు. 'నా నువ్వే' సినిమా తో గత ఏడాది డిజాస్టర్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కె.వి.గుహన్ దర్శకత్వంలో '118' సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి ఒకటవ తారీఖున విడుదల కానుంది.

ఈ సినిమా తరువాత విరించివర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఏప్రిల్ నుండి మొదలు కానుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి. ఇక ఇప్పటికే ఈ నెల మొదట్లో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో 'ఎన్టీఆర్ కథానాయకుడు' లో ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసింది. అంటే ఒక్క సంవత్సరంలోనే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కళ్యాణ్ రామ్.

Show Full Article
Print Article
Next Story
More Stories