మహేష్ కోసం అడవి కథ

మహేష్ కోసం అడవి కథ
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మహేష్ బాబు కోసం ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని తెలుస్తోంది.

'రంగస్థలం' సినిమా కోసం 1980 లలో గోదావరి పల్లెటూరి నేపథ్యంలో అద్భుతమైన కధ రాసిన సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబు కోసం అడవి బ్యాక్ డ్రాప్ తో ఒక కథను సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే సాగుతుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని అడవుల్లో ఈ చిత్ర కథ సాగుతుంది. ఇప్పటిదాకా మహేష్ ఈ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయలేదు. రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మే లేదా జూన్ లో పట్టాలెక్కనుంది. మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories