'డిస్కో రాజా' గా మాస్ మహారాజ

డిస్కో రాజా గా మాస్ మహారాజ
x
Highlights

వరుసగా 'టచ్ చేసి చూడు', 'నేలటికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు డిజాస్టర్ గా మారడంతో, రవితేజ మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు.

వరుసగా 'టచ్ చేసి చూడు', 'నేలటికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు డిజాస్టర్ గా మారడంతో, రవితేజ మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక రవితేజ తన ఆశలన్నీ వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే పెట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పట్టాలెక్కాలి కానీ రవితేజ ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పడంతో, దర్శకుడు ఆ పనిలో పడ్డాడు. అయితే రవితేజ బర్త్డ్‌డే సందర్భంగా ఈరోజు సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ టైటిల్ లోగోను విడుదల చేశారు.

ఈ సినిమాకు 'డిస్కో రాజా' అనే టైటిల్ ను పెట్టారు. ఒక్క సీతాకోకచిలుక బొమ్మకి మధ్యలో టైటిల్ ను డిజైన్ చేసి లోగో తోనే మంచి ఇంప్రెషన్ ను కొట్టేశారు దర్శక నిర్మాతలు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో రవితేజతో రొమాన్స్ చేయనుంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories