Pawan Kalyan: పవన్ కల్యాణ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం

Pawan Kalyan: పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Jyothi
Published on: 29 May 2023 2:32 PM IST
Fire Accident On Pawan Kalyan Film Set
X

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం

Pawan Kalyan: పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పిరియాడిక్ డ్రామాగా దర్శకుడు హరిహరవీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం రీసెంట్ గా హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో భారీ సెట్ వేశారు. ఈ సెట్ ఆదివారం అర్థరాత్రి సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది.

హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షానికి సెట్ దెబ్బతింది. దీంతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ సమయంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి యూనిట్ సభ్యులు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

హరిహరవీరమల్లు షూటింగ్ ఇంకా 30 శాతం వరకు పెండింగ్ ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా మళ్లీ రిపేర్ చేసి సెట్ చేసే పనిలో మూవీ మేకర్స్ నిమగ్నం అయ్యారు. తాజా ఘటనలో మూవీ షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొఘల్ కాలంనాటి ఓ వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నాడు.

Jyothi

Jyothi

Next Story