అమితాబ్ తో నా కోరిక తీరుతోంది: ప్రభాస్

అమితాబ్ తో నా కోరిక తీరుతోంది: ప్రభాస్
x

Amitabh Bachchan, Prabhas 

Highlights

Prabhas Tweet On Amitabh : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే..

Prabhas Tweet On Amitabh : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ సంస్థ వెల్లడించింది. అయితే ఈ బిగ్ సర్‌ప్రైజ్‌ పై హీరో ప్రభాస్ స్పందించారు. 'అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే నా కోరిక తీరుతోంది. థాంక్యూ సర్' అని ట్వీట్ చేశారు. 'ఇది ఎంతో కీలకమైన పూర్తిస్థాయి పాత్ర. ఆయన పాత్ర పేరే అప్పట్లో మా మొదటి వర్కింగ్ టైటిల్. మా సినిమాలో నటిస్తున్నందుకు థాంక్యూ సర్' అని దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. 'ఇలాంటి గ్రేట్ ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది' అని బిగ్‌బీ సైతం ట్వీట్ చేశారు.


ఇక ఇది ప్రభాస్ కి 21వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథాశంతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే!

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories