ప్రభాస్ సినిమాలో అమితాబ్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చిన టీం!

ప్రభాస్ సినిమాలో అమితాబ్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చిన టీం!
x
Highlights

Amitabh Bachchan In Prabhas Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ కి 21వ చిత్రం కావడం విశేషం.

Amitabh Bachchan In Prabhas Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ కి 21వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది అంటూ నిన్న చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. అనుకున్నట్టుగానే ఎవరు ఉహించని సప్ రైజ్ ని ఇచ్చేసింది..

ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టుగా వెల్లడించింది. " ఇలాంటి లెజెండ్ లేకుండా మేము లెజెండ్ లాంటి సినిమాను ఎలా తీయగలం" అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రభాస్ సినిమాలో అమితాబ్ అనగానే సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. "కోట్లాది భారతీయులకు గర్వకారణమైన నటుడిని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మా ప్రయాణం మరింత పెద్దదయింది" అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.


ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథాశంతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories