ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రేపు బిగ్ అనౌన్స్‌మెంట్!

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రేపు బిగ్ అనౌన్స్‌మెంట్!
x
Highlights

Prabhas, Nag Ashwin Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ కి 21వ చిత్రం కావడం విశేషం..

Prabhas, Nag Ashwin Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ కి 21వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథాశంతో తెరకెక్కిస్తున్నారు.

అయితే సినిమా నుంచి రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు కీలక ప్రకటన రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ వైజయంతి మూవీస్ ప్రకటన చేసింది. 'రేపు ఉదయం గం.10కి బిగ్ అనౌన్స్‌మెంట్. సిద్ధంగా ఉండండి' అంటూ ట్వీట్ చేసింది. దీనితో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి టైటిల్ ని అనౌన్సు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే!ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories