ప్రభాస్‌ పుట్టినరోజున 'రాధేశ్యామ్‌' సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!

ప్రభాస్‌ పుట్టినరోజున రాధేశ్యామ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!
x

prabhas 

Highlights

Prabhas Birthday : గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌' అనే సినిమాని చేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది

Prabhas Birthday : గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్‌' అనే సినిమాని చేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది ప్రభాస్ కి 20వ చిత్రం కావడం విశేషం.. అయితే ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇక వైపు షూటింగ్‌ను జరుపుతూనే మరోవైపు టీజర్‌ను సిద్ధంచేసే పనిలో చిత్రబృందం.. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఇక ఈ సినిమా తర్వత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించనుంది. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్డేట్ ను ప్రేక్షకుల ముందు ఉంచుతామని వెల్లడించారు నాగ్‌అశ్విన్‌.. అయితే ఆ రోజున సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారని సమాచారం!

Show Full Article
Print Article
Next Story
More Stories