Malashri: నటి మాలాశ్రీ భర్త, నిర్మాత రాము కరోనాతో మృతి

Kranthi
Updated on: 27 April 2021 9:43 AM IST
Film Producer, Actress Mala sri Husband Died With Corona
X

Actress Malasri Husbend:(File Image)

Malashri: తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్‌గా నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీ భర్త ప్రముఖ నిర్మాత రాము(52) కరోనాతో కన్నుమూసారు. ఈయన కన్నడలో పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయనకు వారం క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూసారు.

ఈయన కర్ణాటకలోని తుముకూరు జిల్లాకు చెందిన వారు. కన్నడ చిత్ర సీమలో పలు భారీ చిత్రాలను ముఖ్యంగా తన భార్య మాలాశ్రీతో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కన్నడలో ఈయన నిర్మించిన పలు చిత్రాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. దాదాపు 40 చిత్రాల వరకు నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరు ఉండటంతో ఈయనను అందరు కోటి రాముగా పిలుస్తారు. ఈయన సాయి కుమార్‌ హీరోగా ఏకే 47, లాకప్ డెత్, కలాసి పాళ్య లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించారు. ఈయన హీరోయిన్ మాలాశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన అకాల మరణంతో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన అంత్యక్రియలు బెంగుళూరులో ఈ రోజు జరగనున్నాయి.

2020 లాగా 2021 చిత్ర సీమకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ యేడాది ఇప్పటికే నటుడు వివేక్, పొట్టి వీరయ్య వంటి ప్రముఖ నటులు కన్నుముసారు. ఆ సంగతి మరవకముందే మరో ప్రముఖ సినీ ప్రముఖుని కరోనా బలి తీసుకుంది.

Kranthi

Kranthi

Next Story