Film Critic KRK: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ ల విడాకులు అప్పుడే..!?

Sandeep Reddy
Updated on: 12 July 2021 7:52 PM IST
Film Critic Kamaal R Khan Predicts Nick Jonas will divorce Priyanka Chopra in 10 Years
X

ప్రియాంక చోప్రా- నిక్ జోనస్, కె ఆర్ కె (ఫైల్ ఫోటో)

Film Critic KRK: బాలీవుడ్ నుండి హాలీవుడ్ స్థాయి వరకు నటిగా ఎదిగిన ప్రియాంక చోప్రా హిందీలో టాప్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ గా ఎంపికైన ప్రియాంక చోప్రా అటు నటిగానే కాకుండా నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మిస్ వరల్డ్ గా ఎంపికైన తర్వాత మూడు ఏళ్ళకి హీరోయిన్ గా "ది హీరో" చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ భామ ఇటీవల హాలీవుడ్ లోని క్యంటిగో వెబ్ సిరీస్ లో నటించి ప్రపంచ స్థాయిలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. 38 ఏళ్ళ ప్రియాంక చోప్రా తనకంటే 10 ఏళ్ళ వయసు తక్కువగా ఉన్న అమెరికన్ సింగర్ మరియు నటుడు అయిన నిక్ జోనస్ నూ పెళ్ళాడి అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక వీకెండ్ పార్టీలతో నిక్ కుటుంబ సభ్యులతో తక్కువ టైంలోనే కలిసిపోయి తన సంసార జీవితాన్ని గడుపుతుంది.

గతంలో తన పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని, ట్రోల్స్ ని పట్టించుకోకుండా పలు సినిమాలతో పాటు, టాక్ షోలతో బిజీగా ఉన్న ఈ భామ గురించి తాజాగా సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ లు మరో 10 ఏళ్ళ లోపే విడిపోతారని కమల్ ఆర్ ఖాన్ జోస్యం చెప్పాడు. తను చేసిన ఈ పోస్ట్ పై పలువురు నెటిజన్లు కమల్ ఆర్ ఖాన్ పై మండిపడుతున్నారు. గతంలో కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రేటిస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్ తాజాగా ప్రియాంక చోప్రా విడాకుల విషయంతో తెర మీదికి వచ్చాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story