Faria Abdullah: కాజల్ అగర్వాల్ స్థానంలో ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: నాగార్జున తో రొమాన్స్ చేయబోతున్న "జాతిరత్నాలు" బ్యూటీ

admin1
Published on: 23 Dec 2021 12:53 PM IST
Faria Abdullah Replacing Kajal Agarwal in Akkineni Nagarjuna New Movie The Ghost | Tollywood News
X

నాగార్జున తో రొమాన్స్ చేయబోతున్న "జాతిరత్నాలు" బ్యూటీ(ఫైల్-ఫోటో)

Faria Abdullah: ఈ మధ్యనే "జాతిరత్నాలు" సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో కనిపించిన ఫరియా ఈ మధ్యనే నాగార్జున మరియు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న "బంగార్రాజు" సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా డాన్స్ చేసింది.

ఈ మధ్యనే ఈ పాట తాలూకా షూటింగ్ పూర్తి చేసుకున్న ఫరియా ఇప్పుడు ఏకంగా నాగార్జున సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పొందినట్లు తెలుస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో "ది ఘోస్ట్" అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అమలాపాల్, ఇలియానా, మెహ్రీన్ పిర్జాదా వంటి పేర్లు వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story