Preetham Jukalker - Samantha: నాగ చైతన్య - సమంత మధ్యలో ప్రీతమ్ జుకాల్కర్..!!

Sandeep Reddy
Updated on: 4 Oct 2021 12:45 PM IST
Fans Trolling on Preetham Jukalker is the Reason for Naga Chaitanya and Samantha Divorce in Social Media
X

సమంత -  ప్రీతమ్ జువాల్కర్ (ఫైల్ ఫోటో)

Preetham Jukalker - Samantha: ప్రీతమ్ జుకాల్కర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన పేరు. నిన్న మొన్నటి వరకు సమంత - నాగ చైతన్య విడాకుల విషయం గురించి మాట్లాడుకున్న నెటిజన్లు.. విడాకుల తరువాత సమంత విడాకుల భరణం గురించి చర్చ మొదలుపెట్టారు. తాజాగా సమంత నాగచైతన్యకి విడాకులు ఇవ్వడానికి కారణం ఇతడే అంటూ ప్రీతమ్ జుకాల్కర్ ని పచ్చని సంసారంలో నిప్పులు పోశావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

33 ఏళ్ళ ప్రీతమ్ జుకాల్కర్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రస్తుతం ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తల్లి కుట్టు మిషన్ కుట్టడం చూసిన ప్రీతమ్ చిన్ననాటి నుండి డిజైనర్ అవ్వాలనే ఆశతో ఫ్యాషన్ కి సంబంధించిన చిన్న చిన్న ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడంతో పాటు ఫ్యాషన్ అండ్ టెక్స్ట్ టైల్స్ డిగ్రీ కూడా చేశాడు.

ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ తో పాటు మోడల్స్ కి డిజైనర్ గా ఉన్న ప్రీతమ్ జుకాల్కర్ పుట్టిన రోజు సందర్భంగా గత 8 నెలల క్రితం సమంత చేసిన పోస్ట్ అప్పట్లో వైరల్ గా మారింది. ప్రీతమ్ జుకాల్కర్ తో తనకున్న బంధాన్ని వివరిస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. సోఫాలో కూర్చున్న ప్రీతమ్ జుకాల్కర్ పై కాళ్ళు వేసి పడుకున్న సమంత అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటో అప్పట్లో హాట్ టాపిక్ గా మారడం.. ఆ పోస్ట్ చేసిన సమంతకి ప్రీతమ్ జుకాల్కర్ ఐ లవ్ యూ అంటూ రిప్లై ఇవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

తాజాగా సమంత విడాకులు విషయం తెలియడంతో అతడే ఈ విడాకులకు కారణం అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల సెప్టెంబర్ 20న సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో త్రిష, కీర్తి సురేష్ తో పాటు ప్రీతమ్ ఉన్న ఫోటోని షేర్ చేయడంతో పాటు ఇటీవల జరిగిన ప్రతి ఫోటోషూట్ కి ప్రీతమ్ జుకాల్కర్ ని డిజైనర్ అంటూ పేరు చెబుతూ పోస్ట్ చేయడం జరిగింది. తాజాగా అభిమానుల ట్రోల్ తట్టుకోలేక ప్రీతమ్ జుకాల్కర్ తన కామెంట్ సెక్షన్ ని కూడా డిజేబుల్ చేశాడు. సమంతతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కళ్యాణి ప్రియదర్శి, త్రిష, కీర్తి సురేష్ లకు ప్రీతమ్ జుకాల్కర్ డిజైనర్ గా ఉన్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story